Allu Arjun: టూ మచ్ సార్, బట్టలు మార్చకునే సమయం ఇవ్వరా?..అల‌్లు అర్జున్ 9 d ago
నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో పెద్ద డ్రామానే జరిగినట్లు బయటకొచ్చిన వీడియోలు చూస్తే అర్థమవుతోంది. పోలీసులు నేరుగా జూబ్లీ హిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసంలో బెడ్ రూమ్‌కి వెళ్లి మరీ.. ఆయనను కిందకు తీసుకొచ్చారు. ఈ సమయంలో బన్ని రౌండ్ నెక్ టీషర్ట్, షార్ట్ పైనే ఉన్నారు. అనంతరం డ్రెస్ మార్చుకుని ఇంటి పార్కింగ్ ఏరియాలో కొచ్చిన అల్లు అర్జున్, పోలీసుల సంభాషణ ఆసక్తికరంగా మారింది.
అరెస్ట్ సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరును అల్లు అర్జున్ తప్పుబట్టారు. కూల్‌గా కాఫీ తాగుతూ పోలీసులకు కౌంటర్ ఇచ్చారు. 'రెడీ సార్, నా కాఫీ అయిపోయింది.' అని అల్లు అర్జున్ అనగా.. ఓ పోలీసు అధికారి మీ గౌరవానికి భంగం కలగకుండా..తీసుకెళ్తున్నామని ఏదో చెప్తుండగా.. మధ్యలో అడ్డుకున్న అర్జున్.. మాట్లాడుతూ.. 'మీరేం హానర్ చేయలేదు. సార్, రూమ్ కెళ్లి బట్టలు మార్చుకొస్తానంటే సమయం ఇవ్వలేదు. పైకి ఒకరిని పంపమంటే.. బెడ్ రూమ్ బయట పదిమంది ఉన్నారు. సార్, మీరు నన్ను అరెస్ట్ చేయడంలో ఎలాంటి తప్పులేదు. కాదనను. కానీ, మరీ బెడ్ రూమ్ బయటకొచ్చి...అక్కడ నుంచి నన్ను తీసుకురావడం.. అది మరీ.. టూ మచ్ సార్. తప్పకుండా చెప్తున్నా.. ఇది మంచి విషయం కాదు.' అని చాలా సింపుల్‌గా..కూల్‌గా కాఫీ తాగుతూ కౌంటర్ ఇచ్చారు అల్లు అర్జున్.
అనంతరం తన సోదరుడు అల్లు శిరీష్, సిబ్బందితో మాట్లాడారు. తన భార్య స్నేహరెడ్డికి ధైర్యం చెప్పి, బుగ్గన ముద్దు పెట్టారు. అనంతరం అక్కడి నుంచి పోలీసు వాహనం ఎక్కారు. ఆ సమయంలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు.